కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూత

కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూత

టాలీవుడ్‌ లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు,నిర్మాత, కాస్ట్యూమ్ డిజైనర్ అయిన కాస్ట్యూమ్ కృష్ణ మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన...చెన్నైలోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. 

విజయనగరం జిల్లాకు చెందిన కాస్టూమ్స్ కృష్ణ..కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన భారత్ బంద్ సినిమాతో నటుడిగా పరిచయం అయ్యారు. పెళ్లి పందిరి సినిమాను నిర్మించి అందులో నటించారు. పెళ్లాం చెబితే వినాలి, అల్లరి మొగుడు, దేవుళ్లు, మా ఆయన బంగారం, విలన్, పుట్టింటికి రా చెల్లి వంటి అనేక సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.