హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ప్రారంభమైంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాజీ న్యాయమూర్తి జస్టిస్ యతిరాజులు నేతృత్వంలో ఈ కౌంటింగ్ మొదలైంది. ఇప్పటివరకు రెండు బాక్స్‌ల్లోని సుమారు 498 ఓట్ల కౌంటింగ్ పూర్తయింది. ఇందులో చెల్లని ఓట్లు 204 దాకా ఉండగా, 294 ఓట్లు చెల్లుబాటయ్యాయి.
దాదాపు 41 శాతం ఓట్లు చెల్లకుండా పోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతున్నది. రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు 23 మంది సభ్యులను ఎంపిక చేసుకోవాల్సి ఉండగా ఇందులో మహిళలు తప్పనిసరిగా అయిదుగురు ఉండాలి. గత నెల 30న జరిగిన ఎన్నికల్లో బార్ కౌన్సిల్ సభ్యుల పోస్టుల కోసం 203 మంది న్యాయవాదులు పోటీ పడ్డారు.
