ఓ ఫ్యామిలీ చైన్ స్నాచింగ్..కుటుంబంతో  వచ్చి దొంగతనం..మల్కాజిగిరిలో ఘటన

ఓ ఫ్యామిలీ చైన్ స్నాచింగ్..కుటుంబంతో  వచ్చి దొంగతనం..మల్కాజిగిరిలో ఘటన

మల్కాజిగిరి, వెలుగు: మల్కాజిగిరి పరిధిలోని హనుమాన్​పేట్​లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిని మభ్యపెట్టి బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 4న మహంకాళి లక్ష్మీకాంతం అనే వృద్ధురాలి ఇంటికి ఓ చిన్నారితో కలిసి నగ్గరి కిరణ్, నగ్గరి పావని దంపతులు స్కూటీపై వచ్చి, ఇంటి పనులు ఉన్నాయా అని మాటల్లో పెట్టారు.

కొద్దిసేపటి తర్వాత తాగడానికి నీళ్లు కావాలని అడగడంతో వృద్ధురాలు లోపలికి వెళ్లగా, ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని నిందితులు పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ముషీరాబాద్ ప్రాంతంలో నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. 16 గ్రాముల బంగారు గొలుసు, నేరానికి వాడిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.