ఫిబ్రవరి 13 నుంచి కీసర గుట్ట బ్రహ్మోత్సవాలు

ఫిబ్రవరి 13 నుంచి కీసర గుట్ట బ్రహ్మోత్సవాలు
  • ఏర్పాట్లు పరిశీలించిన సీపీ అవినాష్ మహంతి

కీసర, వెలుగు: కీసర గుట్ట శ్రీభవానీ రామలింగేశ్వర స్వామి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 13 నుంచి 18 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం మల్కాజిగిరి సీపీ అవినాష్ మహంతి ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ అధికారులతో కలిసి క్యూ లైన్లు, పరిసర ప్రాంతాలను సమీక్షించి స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాలకు ఇంకా ఐదు రోజులే ఉన్నందున చాలా పనులు పెండింగ్​లో ఉన్నాయని, వాటిని వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ముఖ్యంగా భక్తుల వాహనాల పార్కింగ్ స్థలాల్లో విద్యుత్ లైట్లు, సీసీ కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట డీసీపీ శ్రీధర్, ఏసీపీ చక్రపాణి, ఆలయ చైర్మన్ తటాకం వెంకటేష్ శర్మ ఉన్నారు.