
జూబ్లీహిల్స్/ మెహిదీపట్నం, వెలుగు: బోరబండ, రహ్మత్‌నగర్, బంజారాహిల్స్, లంగర్‌హౌస్ లోని ముఖ్యమైన గణేశ్మండపాల వద్ద సిటీ సీపీ సీవీ ఆనంద్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండపాల నిర్వాహకులు, వలంటీర్లతో మాట్లాడారు. మండపాల వద్ద భద్రతను పరిశీలించి సూచనలు ఇచ్చారు. వర్షాలు పడుతున్నందున మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వెస్ట్ జోన్‌డీసీపీ విజయ్‌కుమార్, ఎస్బీ డీసీపీ అపూర్వా రావు, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే పాల్గొన్నారు.