కరోనా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే ఏడాది జైలు

కరోనా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే ఏడాది జైలు

కరోనా వైరస్ గురించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే ఏడాది జైలుశిక్ష పడుతుందని హెచ్చరించారు సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్.  రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీస్ స్టేషన్ లోని డీసీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇవాళ శంషాబాద్ ఎయిర్ పోర్టులో  70 వేల మంది ప్రయాణికులకు స్క్రీనింగ్ టెస్టులు చేశామన్నారు. ఎవరికీ కరోనా పాజిటివ్ రాలేదన్నారు.

సోషల్ మీడియాలో కరోనా వైరస్ గురించి తప్పుడు ప్రచారం చేయడం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. కాబట్టి ఎవరైతే సోషల్ మీడియా ఫేక్ పోస్టులు చేసినా.. పబ్లిసిటీ చేసినా చట్టపరంగా ఒక ఏడాది పాటు జైలు శిక్ష పడుతుందన్నారు. కరోనా వైరస్ లక్షణాలున్న వ్యక్తిని 14 -20  రోజుల పాటు అబ్జర్వేషన్ లో పెడతామన్నారు.

see more news

కరోనాపై కేరళ పోలీసుల డ్యాన్స్ వీడియో వైరల్

పంతాలు పట్టింపులు వదిలి.. కేంద్రం చెప్పింది చేయండి

విదేశాల్లో 276 మంది ఇండియన్స్‌కి కరోనా