పేరెంట్స్ను పోషించకపోతే.. కేసులు పెట్టి లోపలేస్తాం..వేధిస్తే చట్టప్రకారం యాక్షన్ తీసుకుంటాం: సీపీ సుధీర్బాబు

పేరెంట్స్ను పోషించకపోతే.. కేసులు పెట్టి లోపలేస్తాం..వేధిస్తే చట్టప్రకారం యాక్షన్ తీసుకుంటాం: సీపీ సుధీర్బాబు

హైదరాబాద్​సిటీ, వెలుగు: పిల్లలు తమ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని లేకపోతే కేసులు పెట్టి లోపలేస్తామని రాచకొండ సీపీ సుధీర్ బాబు హెచ్చరించారు. పేరెంట్స్​ను వేధిస్తే చట్టప్రకారం యాక్షన్ తీసుకుంటామని తెలిపారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో వృద్ధుల కోసం ‘గోల్డెన్ కేర్’ ప్రోగ్రామ్​ను గురువారం ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘వృద్ధులు ఆర్థికపరమైన మోసాలకు గురికాకుండా చూస్తాం. ఒకవేళ మోసపోతే పోలీసులను సంప్రదించేలా అవగాహన కల్పిస్తాం. కొడుకులు, కూతుళ్లు తమ పేరెంట్స్​ను సరిగ్గా చూసుకోవాలి. శారీరక, మానసిక వేధింపులకు గురి చేస్తే చట్టప్రకారం వాళ్లు శిక్షార్హులు అవుతారు. రాచకొండ కమిషనరేట్​లోని 47 పోలీస్​స్టేషన్ల పరిధిలోంచి 470 మంది వృద్ధులను సెలెక్ట్ చేస్తున్నాం. ప్రతి వారం వారి బాగోగులు చూసుకుంటాం. ఏదైనా సమస్యలుంటే అండగా ఉంటాం’’అని సీపీ సుధీర్ బాబు తెలిపారు.