హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని వర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో పీజీ అడ్మిషన్లకు సంబంధించి సీపీగెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తయింది. మొత్తం 47,237 సీట్లు అందుబాటులో ఉండగా, 23,122 మంది వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 17,586 మందికి సీట్లు కేటాయించినట్లు సీపీగెట్ కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు. విద్యార్థులు కామర్స్, సైన్స్ కోర్సులపై ఎక్కువ ఆసక్తి చూపారు. అత్యధికంగా ఎంకామ్‌లో 1,857 మందికి సీట్లు లభించాయి.
ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనెటిక్స్ అండ్ మైక్రోబయాలజీలో 1,223 మంది, న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్‌లో 1,169 మంది, ఎంఏ ఇంగ్లీష్‌లో 1,159 మంది, ఎంఎస్సీ కెమిస్ట్రీలో 1,131 మంది, బాటనీలో 1,012 మంది సీట్లు పొందారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 21లోగా కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు.
