కూకట్పల్లి: ఐస్క్రీమ్లో పురుగులు.. వెంట్రుకలు

కూకట్పల్లి: ఐస్క్రీమ్లో పురుగులు.. వెంట్రుకలు

కూకట్​పల్లి, వెలుగు: యాప్​ద్వారా ఆర్డర్​ చేసిన ఐస్​క్రీమ్​లో పురుగులు, వెంట్రుకలు కనిపించడంతో కొనుగోలుదారులు నిర్ఘాంతపోయారు. స్టోర్​ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా.. రీప్లేస్​మెంట్​పేరుతో రెండోసారి పంపించిన ఐస్​క్రీమ్​లోనూ పురుగులు, వెంట్రుకలు కనిపించడంతో స్టోర్​ ఎదుట ఆందోళన చేశారు. కేపీహెచ్​బీకాలనీ తొమ్మిదో ఫేజ్​లోని జెప్టో ఐస్​క్రీమ్​ స్టోర్​నుంచి కొందరు యాప్​ ద్వారా ఐస్​క్రీమ్​ఆర్డర్​ చేశారు. 

అయితే, ఐస్​క్రీమ్​లో పురుగులు, వెంట్రుకలు చూసి షాక్​కు గురై  కంప్లయింట్​చేశారు. మరో ఆర్డర్​పంపించినా అందులోనూ పురుగులు ఉండడంతో షాప్​వద్దకు వెళ్లి నిర్వాహకులను నిలదీశారు. వారు నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడంతో స్టోర్​ ఎదుట ఆందోళన చేశారు.