సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా చేయాలి: కూనంనేని

సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా చేయాలి: కూనంనేని

ఎమ్మెల్సీ కవితపై జరుగుతున్న సీబీఐ విచారణ వెనుక కుట్ర ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా సీబీఐ విచారణ ఎలా చేస్తుందని కూనంనేని ప్రశ్నించారు.

ఇప్పటి వరకు ఎంత మంది బీజేపీ నేతలపై ఈడీ దాడులు జరిగాయో చెప్పాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు.