నేను ఎటూ పారిపోలేదు : సీపీఐ లీడర్ మర్రి వెంకట స్వామి

నేను ఎటూ పారిపోలేదు :  సీపీఐ లీడర్ మర్రి వెంకట స్వామి
  • సీపీఐ లీడర్ మర్రి వెంకటస్వామి

కరీంనగర్, వెలుగు: తాను ఎక్కడికి పారిపోలేదని, లాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చట్టం, న్యాయం పట్ల అపారమైన గౌరవం ఉందని, తనపై వస్తున్న ఆరోపణలు కట్టుకథలని సీపీఐ మాజీ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి బుధవారం తెలిపారు. కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో నమోదైన భూకబ్జా కేసులో మర్రి వెంకటస్వామి ఏ2గా ఉన్న విషయం తెలిసిందే. 

పోలీసుల విచారణలో తప్పు అని తేలితే ఎంతటి శిక్షనైనా అనుభవించాల్సిందేనని, అలాగే తాను సైతం తప్పు చేస్తే తప్పక శిక్ష అనుభవిస్తానని వెల్లడించారు. పోలీస్ అధికారులు ఎప్పుడు పిలిచినా వెళ్లేందుకు విచారణకు పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.