
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో క్రిమినల్స్ పాలన కొనసాగుతుందంటూ హాట్ కామెంట్స్ చేశారు. దేశ రాజ్యాంగాన్ని ప్రధాని మోడీ ధ్వంసం చేశారన్న నారాయణ.. సంస్థాగత వ్యవస్థలను మోడీ నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విధ్వంస పాలన అంతం చేసేందుకే ఇండియా కూటమి ఏర్పడిందన్నారు. తెలంగాణలో కూడా ఇండియా కూటమిని బలపరుస్తామని చెప్పుకొచ్చారు. సీపీఐ 99 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.
బడుగు, బలహీన వర్గాల గొంతే ఎర్ర జెండా అని కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కార్మికులు.. పేద వారి తరుపున గొంతు వినిపించేది కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పారు. కమ్యూనిస్ట్ పార్టీ అంతరిస్తుందని కొంతమంది పనిగట్టుకుని అబద్దాలు ప్రచారం చేస్తున్నారని... ఒక్క ఎమ్మెల్యే సీటు మనం గెలిస్తే రెండు రాష్ట్రాల్లో ప్రజలు సంబరాలు చేసుకున్నారని చెప్పారు. ఎర్ర జెండాను నమ్ముకున్న వారు పార్టీ మారరని తెలిపారు. వచ్చేది వందో సంవత్సరం కాబట్టి పార్టీని మరింత బలోపేతం కోసం పని చేస్తామని అన్నారు కూనంనేని.