ప్రధాని మోదీ దేశానికి ప్రమాదకరం: సీపీఐ నారాయణ

ప్రధాని మోదీ దేశానికి ప్రమాదకరం: సీపీఐ నారాయణ

ప్రధాని మోదీ దేశానికి ప్రమాదకరమన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఆర్బీఐ, సీఈసీ వంటి ప్రజాస్వామ్య వ్యవస్థలను బ్రష్ట్ పట్టించారని విమర్శించారు.  భారత రాష్ట్రపతి గిరిజన మహిళల కావడంతో రామ్ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నవాళ్లకు పదవులు ఇస్తున్నారని ఆరోపించారు. ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమన్నారు. ఇలాంటి ఉన్మాద ఘటనలపై మనమందరం ఏకమై పోరాటం చేయాలన్నారు.

హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని అఖిల భారత యూనివర్సిటీ విద్యార్థుల ఆధ్వర్యంలో భారత్ బచావో, ఆల్ ఇండియా స్టూడెంట్స్ కాన్ఫరెన్స్  లో నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. దేశంలోని ప్రభుత్వాలు విద్యకు క్రమక్రమంగా బడ్జెట్ ను తగ్గిస్తున్నాయన్నారు.  NEP పేరు మీద విద్యా వ్యవస్థను బ్రస్ట్ పట్టిస్తూ శాస్త్రాలను, వర్ణవ్యవస్థను పెంచి పోషిస్తుందన్నారు. మేధావులు, సైంటిస్టులు, విద్యావేత్తలు, విగ్రహ దేవుళ్ళకు మొక్కుతున్నారని చెప్పారు. ప్రస్తుత వ్యవస్థలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేవారు ఏకతాటిపైకి రావాలన్నారు.