భారత అత్యున్నత పురస్కారాన్ని తిరస్కరించిన మాజీ సీఎం

భారత అత్యున్నత పురస్కారాన్ని తిరస్కరించిన మాజీ సీఎం

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య భారతదేశపు మూడవ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ అవార్డును తిరస్కరించారు. ఈ పురస్కారానికి తన పేరు ఎంపికైనట్లు కూడా తనకు తెలియదని ఆయన అన్నారు. ‘పద్మభూషణ్ అవార్డు గురించి నాకు ఏం తెలియదు. దాని గురించి ఎవరూ నాకు ఏం చెప్పలేదు. నిజంగా భారత ప్రభుత్వం నాకు ఈ పురస్కారాన్ని ప్రకటిస్తే.. నేను దానిని తిరస్కరిస్తాను’ అని భట్టాచార్య అన్నారు. అయితే దేశం అందించే అత్యున్నత పురస్కారాలను తిరస్కరించడమనేది చాలా అరుదైన విషయం. కాగా.. ఈ అవార్డు గురించి కేంద్ర హోం కార్యదర్శి భట్టాచార్య భార్యతో మాట్లాడారు. ఆయనకు అవార్డును ప్రకటించినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 

భారత అత్యున్నత పురస్కారాలను తిరస్కరించిన వారు గతంలో కూడా ఉన్నారు. 2015లో పద్మశ్రీని స్వీకరించేందుకు సినీ రచయిత సలీం ఖాన్ ఒప్పుకోలేదు. ఆయన కంటే ముందు చరిత్రకారిణి రొమిలా థాపర్ 2005లో పద్మభూషణ్‌ను తిరస్కరించారు. 1974లో భారత సైన్యం గోల్డెన్ టెంపుల్‌ను ముట్టడించినందుకు ఆమెకు అవార్డును ప్రధానం చేశారు. కానీ ఆ అవార్డును 1984లో తిరిగి ఇచ్చేశారు. ఇదే సమస్యపై రచయిత ఖుష్వంత్ సింగ్ కూడా 1974లో పద్మభూషణ్‌ను అందుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆయన కూడా 1984లో తిరిగి ఇచ్చేశాడు. అయితే ఆ తర్వాత ఆయన 2007లో పద్మవిభూషణ్‌ను ప్రకటించగా.. దానిని తీసుకోవడానికి అంగీకరించాడు.