సర్కారు బడులను మూసివేస్తామన్న..సీఎం ప్రకటనను వెనక్కి తీసుకోవాలి :జాన్వెస్లీ 

సర్కారు బడులను మూసివేస్తామన్న..సీఎం ప్రకటనను వెనక్కి తీసుకోవాలి :జాన్వెస్లీ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల మూసివేతపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు, టీజీపీఎస్సీ ఉద్యోగ దరఖాస్తు ఫీజుల పెంపుపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఫైర్​ అయ్యారు. ప్రభుత్వ నిర్ణయాలు పేద విద్యార్థులను, నిరుద్యోగ యువతను దగా చేసేలా ఉన్నాయని ఆయన శనివారం పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 23 వేల ప్రభుత్వ పాఠశాలలను కేవలం 4 వేలకు కుదిస్తామంటూ సీఎం ఓ ఇంటర్వ్యూలో చెప్పడం దారుణమన్నారు.

విద్యా హక్కు చట్టం-2009 ప్రకారం విద్యార్థుల నివాసాలకు సమీపంలోనే బడులు ఉండాలని, సీఎం నిర్ణయం వల్ల దళిత, గిరిజన పిల్లలు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం  చేశారు. బడుల్లో మౌలిక వసతులు కల్పించకుండా, టీచర్లను నియమించకుండా పాఠశాలలను మూసివేయడం కార్పొరేట్ సంస్థలకు మేలు చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీజీపీఎస్సీ దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజును రూ. 200 నుంచి రూ.1,000కి పెంచడంపై ఆయన మండిపడ్డారు.