అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ ఆఫీసు ఎదుట సీపీఎం నాయకుల ఆందోళన

అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ ఆఫీసు ఎదుట సీపీఎం నాయకుల ఆందోళన

కంటోన్మెంట్, వెలుగు: కంటోన్మెంట్​బోర్డు పరిధిలో రోడ్ల మూసివేతను జనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో అప్పుడప్పుడు పలు రోడ్లను మూసివేసే మిలటరీ అధికారులు రెండు నెలల కిందట ఆరు రోడ్లను శాశ్వతంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని కంటోన్మెంట్ ప్రజలు వ్యతిరేకించారు. బోర్డు అధికారులు గత నెలలో ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించగా మంగళవారం ఈ ప్రక్రియ ముగిసింది. జనం మూసివేతను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది.

120 వినతిపత్రాలు,2 వేల పోస్టుకార్డులు

కంటోన్మెంట్ పరిధిలోని అమ్ముగూడ రోడ్డు, బయాన్​రోడ్డు, ఆల్బియన్​రోడ్డు, ఎంప్రెస్​రోడ్డు, ప్రొటెన్స్​ రోడ్డు, రిచర్డ్​సన్​రోడ్లను శాశ్వతంగా మూసివేస్తున్నట్లు మిలటరీ అధికారులు అక్టోబరులో ప్రకటించారు. ఈ నెల15 వరకు తమ అభిప్రాయాలు వెల్లడించాలని స్థానికులను కోరారు. ఈ అంశాన్ని సంక్షేమ సంఘాలు, ప్రజాప్రతినిధులు, స్థానికులు వ్యతిరేకించారు. మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ సంతకాలు, పోస్టుకార్టుల ఉద్యమాన్ని ప్రారంభించి డిఫెన్స్ ​మినిస్ట్రీకి పంపించారు. దాదాపు 120కి పైగా వినతి పత్రాలను బోర్డుకు అందజేశారు. ఒక్కో వినతి పత్రంలో 100 నుంచి 150 మంది సంతకాలు చేశారు. అలాగే కాలనీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో సుమారు 2,500 పోస్టు కార్డులను బోర్డు సీఈవోకు పోస్టు చేశారు. కాలనీ సంక్షేమ సంఘాలు తిరుమలగిరిలోని హోలీ ఫ్యామిలీ స్కూల్, గవర్నమెంట్ స్కూళ్లు, బొల్లారంలోని సెయింట్ మేరీ స్కూళ్లతోపాటు మరో 16 విద్యా సంస్థల నుంచి సుమారు 20 వేల మంది స్టూడెంట్ల సంతకాలు సేకరించాయి. వాటిని బోర్డు  అధికారులకు పంపించాయి. హనుమాన్​టెంపుల్, జైన్ టెంపుల్, కృష్ణ మందిర్​తోపాటు బొల్లారం, యాప్రాల్​ప్రాంతాల్లోని చర్చిల నుంచి బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వినతి పత్రాలు ఇచ్చారు. ట్రాన్స్ పోర్టు, ఆటో డ్రైవర్స్ యూనియన్లు మద్దతుగా నిలిచాయి. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, సాయన్న, వివేకానంద, బేతి సుభాష్​రెడ్డి రోడ్లను మూసివేయద్దంటూ డిఫెన్స్​ మినిస్ట్రీని కోరారు.

కమిటీల రిపోర్టు ఏమైంది?

రోడ్ల మూసివేతను ఆపాలని కోరుతూ కంటోన్మెంట్​కు చెందిన పలు కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు సిటీ పోలీస్​ కమిషనర్​ను కలిశారు. పలు చర్చల అనంతరం నగర పోలీసులు, ట్రాఫిక్ విభాగం, బోర్డు అధికారులు కలిసి రెండు కమిటీలను ఏర్పాటు చేశారు. మూసివేయనున్న రోడ్లను పరిశీలించి నివేదిక ఇస్తామని చెప్పారు. అయితే కమిటీ సభ్యులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను సమీక్షించినా ఇప్పటి వరకు నివేదికను వెల్లడించలేదు.

వచ్చే వారం బోర్డు సమావేశం!

రోడ్ల మూసివేత అంశంపై వచ్చే వారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులు, ప్రజాభిప్రాయ సేకరణ నివేదికను పరిశీలించి తుది నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు.