క్రేజ్ తగ్గేదే లే..

క్రేజ్ తగ్గేదే లే..

ఏడాదిపాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నట్టు ఇటీవలే ప్రకటించిన సమంత.. ప్రస్తుతం  చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసింది. కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉంటానని చెప్పినా.. ఆమె క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. సోషల్ మీడియాలో మోస్ట్ పాపులారిటీ ఉన్న హీరోయిన్స్‌‌లో సమంత నెంబర్ వన్‌‌గా నిలిచింది.  ఓరామ్యాక్స్ సంస్థ స్టార్స్ ఆఫ్ ఇండియా లవ్స్ పేరుతో ప్రతి నెలా మోస్ట్ పాపులర్ సెలెబ్రిటీల జాబితాను రిలీజ్ చేస్తూ ఉంటుంది. అలా జూన్ నెలకు గాను.. సమంత ఫస్ట్ ప్లేస్‌‌లో నిలిచింది.  రెండో స్థానంలో బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్, మూడవ స్థానంలో దీపికా పదుకొణె, నాలుగో స్థానంలో నయనతార, ఐదో స్థానంలో కాజల్ అగర్వాల్ నిలిచారు. ఈ జాబితాలో సమంత ఏకంగా ఎనిమిదోసారి ఫస్ట్ ప్లేస్‌‌లో ఉండటం విశేషం. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌‌గా ఉండే సమంత.. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఫ్యాన్స్‌‌తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. సౌత్ ఇండియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోయిన్స్ జాబితాలో సమంత నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఆమెకి ఇన్‌స్టాగ్రామ్‌‌లో 28 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక విజయ్ దేవరకొండతో కలిసి సమంత నటించిన ‘ఖుషి’ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కానుంది.  అలాగే రీసెంట్‌‌గా  రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తున్న హిందీ వెబ్ సిరీస్‌‌ ‘సిటాడెల్’ షూటింగ్‌ను పూర్తి చేసింది.