నగరంలో ఐపీఎల్​ సందడి

నగరంలో ఐపీఎల్​ సందడి

హైదరాబాద్​ : నగరంలో ఐపీఎల్​ సందడి కనిపిస్తోంది. ఉప్పల్​ స్టేడియంలో హైదరాబాద్ సన్​ రైజర్స్​ వర్సెస్​ రాజస్థాన్​ రాయల్స్​ మధ్య ఏప్రిల్ 2న మధ్యాహ్నం 3.30 నిమిషాలకు మ్యాచ్​ స్టార్ట్​ కానుంది. ఉదయం నుంచే ఉప్పల్​ స్టేడియానికి వెళ్లే ప్రధాన రహదారి అంతా రద్దీగా కనిపిస్తోంది.

స్నేహితులతో, కుటుంబసభ్యులతో కలిసి మ్యాచ్​ తిలకించడానికి ఫ్యాన్స్​ స్టేడియానికి చేరుకుంటున్నారు. స్టేడియం బయట యువతీ యువకులు విజిల్స్​, కేకలతో వాతావరణం ఆహ్లాదంగా మారింది. లైవ్​ మ్యాచ్​ను తిలకించబోతుండటం ఆనందంగా ఉందని ఫ్యాన్స్​ చెబుతున్నారు.

రాజస్థాన్​పై హైదరాబాద్​ టీం గెలుపొందాలని కోరుకుంటున్నారు. గతంలో ఐపీఎల్ లో సన్ రైజర్స్, రాజస్తాన్ జట్ల మధ్య 16 మ్యాచ్‌లు జరగగా చెరో ఎనిమిది మ్యాచ్ లు గెలిచి సమానంగా ఉన్నాయి.