త్వరలోనే సీఎం చేతుల మీదుగా..కూకట్ పల్లి నల్లచెరువు ప్రారంభం

త్వరలోనే సీఎం చేతుల మీదుగా..కూకట్ పల్లి నల్లచెరువు ప్రారంభం

హైదరాబాద్  కూకట్‌పల్లి నల్ల చెరువు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు  హైడ్రా కమిషనర్ రంగనాథ్ . మార్చి 6 తర్వాత సీఎం చేతుల మీదుగా ప్రారంభం కానున్న చెరువు అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్  స్వయంగా పరిశీలించారు. మొదటి విడతలో చేపట్టిన 6 చెరువుల్లో ఇప్పటికే బతుకమ్మ కుంట ప్రారంభించారు. పాతబస్తీలోని బమ్రుఖనుద్దౌలా చెరువు, కూకట్‌పల్లి నల్ల చెరువులు త్వరలో ప్రారంభం కానున్నాయి.  

ఈ సందర్భంగా చెరువు చుట్టూ నీడనిచ్చే మొక్కలను పెద్ద ఎత్తున నాటాలని ఆదేశించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.  పార్కులు, పిల్లల ప్లే ఏరియా, ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుపై  జలమండలి అధికారులతో చర్చించారు. పూర్తిస్థాయి అభివృద్ధి తర్వాత చెరువు మరింత అందంగా మారుతుందన్నారు. చెరువు చుట్టూ వాకింగ్, సేదతీరడానికి  ఉండటంతో 5–6 కిలోమీటర్ల దూరం వస్తున్నారు జనం

16 ఎక‌‌‌‌రాల నుంచి 30 ఎక‌‌‌‌రాలకు నల్లచెరువు..

ఆక్రమ‌‌‌‌ణ‌‌‌‌ల‌‌‌‌తో కూక‌‌‌‌ట్‌‌‌‌ప‌‌‌‌ల్లి న‌‌‌‌ల్ల చెరువు 16 ఎక‌‌‌‌రాల్లో మాత్రమే మిగలగా, రెవెన్యూ, గ్రామ రికార్డులు, చెరువుకు సంబంధించిన స‌‌‌‌మాచారం సేకరించిన హైడ్రా 30 ఎక‌‌‌‌రాల‌‌‌‌కు విస్తరించింది.