ట్రూజోన్ సోలార్‎లో క్రికెటర్లు సూర్య, తిలక్ పెట్టుబడి

ట్రూజోన్ సోలార్‎లో క్రికెటర్లు సూర్య, తిలక్ పెట్టుబడి

హైదరాబాద్​, వెలుగు: టీ–20 వరల్డ్​కప్ విజేతలు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ట్రూజోన్ సోలార్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థలో ఇప్పటికే సచిన్ టెండూల్కర్ పెట్టుబడి పెట్టగా, మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌గా ఉన్నారు. 

క్లీన్ ఎనర్జీ రంగంలో కంపెనీ విజన్ పట్ల నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్ భవానీ సురేష్ తెలిపారు. త్వరలో కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు సేవలను విస్తరించనున్నారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో 82 మంది పార్టనర్లతో సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది.