తమ నియోజక వర్గంలో బరిలో ఉన్న అభ్యర్థిపై నమోదైన కేసుల వివరాలను ‘నో యువర్ క్యాండిడేట్ (కేవైసీ)’ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ యాప్ సహాయంతో ఓటర్లు సమర్థవంతమైన నేతను ఎన్నుకొనే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు.
క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు కనీసం మూడుసార్లు న్యూస్ పేపర్, టీవీ చానల్స్ ద్వారా ఓటర్లకు కేసుల వివరాలు తెలపాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా పార్టీ వెబ్ సైట్స్ లో ఆ డేటాను పొందుపరచాలని పేర్కొన్నారు.
