నేషనల్ క్రష్ రష్మిక మందన్న బర్త్‌డే వేడుక ఇరు కుటుంబాల సభ్యులతో ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత వచ్చిన తొలి పుట్టినరోజు కావడంతో ఈసారి ఈ వేడుక మరింత ప్రత్యేకంగా మారింది. ఎంతో సంతోషంగా, సాదాసీదా కుటుంబ వాతావరణంలో ఆమె తన 30వ బర్త్‌డేను జరుపుకుంది.
ప్రస్తుతం ఈ సెలబ్రేషన్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విరోష్ జంట సంప్రదాయ వస్త్రధారణలో పద్ధతిగా మెరిసిపోతూ, కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇన్నాళ్లు సీక్రెట్గా బర్త్ డే వేడుకలు జరుపుకున్న ఈ జంట, తొలిసారి ఇలా కుటుంబ సభ్యులతో కలిసి బర్త్‌డేను సెలబ్రేట్ చేయడం ప్రత్యేకంగా కనిపిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఫ్యామిలీతో సాదాసీదా వేడుక
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలలో రష్మిక, విజయ్ మరియు వారి కుటుంబ సభ్యులు కలిసి కనిపించారు. ఎటువంటి గ్రాండ్ పార్టీ కాకుండా, సాదాసీదా కుటుంబ సమావేశంలా ఈ వేడుక జరిగింది. రష్మిక సంప్రదాయ శైలి చీరలో మెరిసింది. విజయ్ కూడా ట్రెడిషనల్ దుస్తుల్లో సింపుల్‌గా కనిపించాడు. ఈ వేడుక వారి కుటుంబ బాండింగ్‌ను స్పష్టంగా చూపించింది. ఇలా మొత్తానికి రష్మిక బర్త్ డే వేడుక గ్లామర్ కంటే కుటుంబ బాండింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తున్నాయి.
►ALSO READ | Viral Video: లైవ్ షోలో సడన్ షాక్.. భయంతో పరిగెత్తిన సింగర్.. అతనికి చెడు ఉద్దేశ్యం లేదంటూ పోస్ట్
VIROSH Family 🧿💟#Virosh #VijayDeverakonda #RashmikaMandanna pic.twitter.com/PO3freMAzy
— Pavan Kumar (@pavankumar__123) April 5, 2026
విజయ్ స్పెషల్ విషెస్
రష్మిక మందన్న బర్త్ డే సందర్భంగా విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ వీడియోతో విషెష్ తెలిపారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న రణబాలి’ సినిమాకి సంబంధించిన వీడియో పోస్ట్ చేసి.. “ ఐ లవ్ యూ జయమ్మ” అని తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో విజయ్ ఒక రిబెల్ పాత్రలో, రష్మిక “జయమ్మ”గా కనిపించనుంది. సెప్టెంబర్ 11, 2026న మూవీ థియేటర్లలో విడుదల కానుందని సమాచారం.
I love you Jayamma :) pic.twitter.com/HFXUgWCaRm
— Vijay Deverakonda (@TheDeverakonda) April 5, 2026
