గద్దర్ను తెలంగాణ జాతిపితగా ప్రకటించాలి: తెల్లాపూర్ గద్దర్ పునర్జీవన్ సభలో వక్తలు

గద్దర్ను తెలంగాణ జాతిపితగా ప్రకటించాలి: తెల్లాపూర్ గద్దర్ పునర్జీవన్ సభలో వక్తలు

గద్దర్ ను తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని తెల్లాపూర్ లో ఏర్పాటు చేసిన గద్దర్ పునర్జీవన్ సభలో వక్తలు అన్నారు.  1997లో ఇదే రోజున (ఏప్రిల్ 06) గద్దర్ పై కాల్పులు జరిగిన రోజును నిరసిస్తూ తెల్లాపూర్ లో గద్దర్ పునర్జీవన్ సభ ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ కంచె ఐలయ్య, విమలక్క, పాశం యాదగిరి, సామాజిక వేత్త సత్తయ్య, మాజీ కౌన్సిలర్ భరత్ మొదలైన వక్తలు నివాళులర్పించారు. 

  •  ఇప్పటి వరకు ప్రజా యుద్దనౌక, ఇక నుంచి తెలంగాణ జాతిపిత: 

గద్దర్ ను తెలంగాణ జాతిపితగా ప్రకటించుకోవల్సిన సమయం ఇది అని అన్నారు ప్రొఫెసర్ కంచ ఐలయ్య. తెలంగాణ కోసం భువనగురిలో సభలో తెలంగాణ కోసం మాట్లాడితే... అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గద్దర్ మీద కాల్పులు జరిపించారని తెలిపారు. ఇప్పటి వరకు గద్దర్ ప్రజా యుద్దనౌక, ఇక నుంచి గద్దర్ తెలంగాణ జాతిపిత అని పిలుపునిచ్చారు.

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో లక్ష కోట్లు అవినీతి చేసిన కేసీఆర్ ను.. జాతిపితగా ప్రచారం చేస్తున్నారని.. కేసీఆర్ కు ఆ అర్హత లేదన్నారు. మాజీ సీఎం కెసీఆర్ బర్త్ డే రోజు జాతిపిత అని హైదరాబాద్ అంతా ఫ్లెక్సీలు పెట్టించుకుని ప్రచారం చేసుకున్నారు. గద్దర్ తెలంగాణ కోసం తిరిగినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు.   సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా గద్దర్ ను తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని సూచించారు. 

గద్దర్ ను జాతిపిత ప్రకటించకపోతే... తెలంగాణలో కాంగ్రెస్ ఉండదన్నారు. తెలంగాణ కోసం గద్దర్.... సోనియా, రాహుల్ గాంధీని కలిశారు తెలంగాణ కావాలని అడిగారని తెలిపారు. గద్దర్ తప్ప మరొకరు జాతిపిత అయ్యే అవకాశం తెలంగాణలో ఎవరికీ లేదన్నారు. ఆగస్టు 6 న గద్దర్ చనిపోయాడు.. ఆ రోజున ప్రభుత్వం గద్దర్ ను జాతిపితగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. 

  • గద్దర్ మీద కాల్పులు జరిపితే కేసీఆర్ ఏడున్నడు: పాశం యాదగిరి

  తెలంగాణ జాతిపిత అయ్యే అర్హత  ఒక్క గద్దర్ కు మాత్రమేఉందన్నారు సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి. కేసీఆర్ జాతిపిత అంటే నల్లమల నక్కలు నవ్వుకుంటున్నాయన్నారు. గద్దర్ మీద కాల్పులు జరిపితే కేసీఆర్ ఏడున్నడు, బెల్లిలలితక్క చనిపోతే కేసీఆర్ ఏడున్నడు.. అప్పుడు ఆయన చంద్రబాబు కాళ్ళు నొక్కుతున్నడు.. అంటూ మండిపడ్డారు. 

Also Read : బాసర ఆలయ అభివృద్ధి పనులకు.. భూమిపూజ చేసిన సీఎం

భువనగిరిలో 18 మందిని చంద్రబాబు చంపించిండు.. బెల్లి లలితక్క, మారోజు వీరన్న, ఇలా చాలా మందిని చంపించిండు.. ఆనాడు కేసీఆర్ ఏడున్నడు.. చంద్రబాబు పక్కన ఉన్నడు అని తెలిపారు. గద్దర్ జనంలో ఉండేవాడు.. జనం కోసమే నిలబడ్డడు .. గద్దర్ కుటుంబాలను వదిలేసి జనం కోసం మాత్రమే తిరిగారు. కేసీఆర్ పదేళ్లు తాగి పడుకున్నాడు కెసిఆర్ జాతిపిత కాదు... జాతిపీత.. ఒక్కరోజు కూడా సెక్రటేరియట్ కు రాలేదు.. ఫామ్ హౌస్ లో పడుకున్నాడు .. కేసీఆర్ కు తెలంగాణ ద్రోహి అని బిరుదు ఇద్దాం.. అంటూ మండిపడ్డారు. 

  • గ్రామ గ్రామాన గద్దర్ విగ్రహాలు: గద్దర్ దళం ప్రెసిడెంట్  సత్తయ్య

సమాజంలో అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు , విద్యార్థులు, ఉద్యోగులను అందరినీ ఏకం చేసింది  గద్దర్ ఒక్కరేనని.. వాళ్ళ సమస్యల పై పోరాటం చేశారని గద్దర్ దళం ప్రెసిడెంట్  సత్తయ్య అన్నారు. 1997లో భువనగిరి సమావేశంలో పాలకులరా మీ అంతు చూస్తాం అని గద్దర్, బెల్లిలలిత, మారోజు వీరన్న హెచ్చరించారు.. ఆ రోజు అయన మీద ఆరు బుల్లెట్లు దింపారు. బెల్లి లలితక్కను 16 ముక్కలు చేసారు.. గద్దర్ ను ఎంత అణచి వేయాలని చూసిన.. ప్రజల పక్షాన నిలబడ్డారు. జాతిపిత అయ్యే అర్హత గద్దర్ కు తప్ప ఎవరికీ లేదు అని అన్నారు. 

గ్రామ గ్రామాన గద్దర్ విగ్రహాలు పెడతామని.. మహనీయుల విగ్రహాల పేరున గద్దర్ పేరును చేర్చుతామని ఈ సందర్భంగా చెప్పారు. గద్దర్ ను తెలంగాణ జాతిపితను చేయాల్సిందే... ఈ నినాదం గ్రామ గ్రామానికి తీసుకెళ్తామన్నారు. 

గద్దర్ అన్న మరణం చివరి అంచువరకు వెళ్లి మళ్ళీ తిరిగి వచ్చి... జనం మధ్యలో ఉన్నారని ఈ సందర్భంగా విమలక్క అన్నారు. ఈ సమాజంలో అసమానతలు, ఒడిదుకులు ఉన్నంత వరకు, దోపిడీ పాలకులు ఉన్నంత వరకు గద్దర్ అన్న ఉంటాడని తెలిపారు.