ఫుట్‌బాల్‌ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించిన రొనాల్డో 

ఫుట్‌బాల్‌ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించిన రొనాల్డో 

పారిస్: ఫుట్ బాల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఫుట్ బాల్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించాడు. దేశం తరపున అత్యధిక అంతర్జాతీయ గోల్స్ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. బుధవారం రాత్రి రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ తో జరిగిన పిఫా ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచులో రొనాల్డో చివరి నిమిషాల్లో రెండు గోల్స్ చేసి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 
పిఫా గణాంకాల ప్రకారం రొనాల్గో ఇప్పటి వరకు 180 మ్యచులలో 111 గోల్స్ చేసి అగ్రస్థానానికి చేరాడు. అలాగే ఇరాన్ కు చెందిన అలీ దాయ్ 149 మ్యాచుల్లో 109 గోల్స్ సాదించి మూడో స్థానంలో ఉండగా.. ఇదే మ్యాచ్ ద్వారా పోర్చుగల్ తరపున 180 మ్యాచులు ఆడిన సెర్జియో రామోస్ రికార్డును రొనాల్డో సమం చేశాడు. 
చివరి 15 నిమిషాల్లో33 గోల్స్
ఇంటర్నేషనల్ మ్యాచుల్లో రొనాల్డో మ్యాజిక్ చేయడం అలవాటుగా మారినట్లు కనిపిస్తుంది. డ్రా అవుతుందనో.. లేక ఓడిపోవడం ఖాయమో అనుకుంటున్న అనేక మ్యాచులను రొనాల్డో టర్న్ చేసిన ఘటనలు అనేకం. అంతెందుకు చివరి 15 నిమిషాల్లో 33 గోల్స్ చేసిన ఏకైక ఆటగాడు రొనాల్డోనే. తాజా మ్యాచ్ విషయానికి వస్తే ఆరంభంలోనే అంటే 15వ నిమిషంలోనే పోర్చుగల్ కు పెనాల్టీ కార్నర్ లభించినా రొనాల్డో గోల్ చేయలేక నిరాశపరిచాడు. మ్యాచ్ 45వ నిమిషంలో ఐర్లాండ్ ఆటగాడు ఇగాన్ గోల్ చేయడంతో మ్యాచ్ ఐర్లాండ్ వైపు మొగ్గు చూపింది. వెంటనే గోల్స్ సమం చేసేందుకు పోర్చుగల్ తీవ్రంగా శ్రమించినా ప్రయోజనం లేకపోయింది. మరో నిమిషంలో మ్యాచ్ ముగుస్తుందనగా ఆట 89వ నిమిషంలో రొనాల్డో మ్యాజిక్ చేసినట్లు హెడర్ తో గోల్ కొట్టి స్కోర్ సమం చేశాడు. ఆట అదనపు సమయం పొడిగించడంతో ఆరో నిమిషంలోనే రొనాల్డో మరో గోల్ చేసి ఐర్లాండ్ కు చెక్ పెట్టాడు. రొనాల్డో ఆఖరి 7 నిమిషాల్లో చేసిన రెండు గోల్స్ కారణంగా పోర్చుగల్ మ్యాచ్ లో విజయం సాధించింది.