విమర్శలు సహజం.. కానీ వాటిని TRS దిగజార్చింది

V6 Velugu Posted on Oct 26, 2021

  • కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి

హనుమకొండ జిల్లా : ఎన్నికల ప్రచారంలో విమర్శలు.. ప్రతి విమర్శలు ఉండొచ్చు.. అవి చాలా సహజం.. కానీ వాటిని అధికార టీఆర్ఎస్ పార్టీ దిగజార్చేలా చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయన హనుమకొండ జిల్లా పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ పై కేసీఆర్ వాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. 

ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యే లు..  ఎవరి ప్రచారాలను కూడా  అడ్డుకోవడం లేదన్నారు. నిబంధనలు అందరికీ సమానమే అన్నారు.  ఎన్ని ప్రలోభాలకు గురిచేయాలని ప్రయత్నించినా  హుజురాబాద్ ప్రజల డిసైడ్ అయ్యే ఉన్నారని పేర్కొన్నారు. గెలుపు ఓటములు గురించి కాదు ఈ ఎన్నిక, ఈటల రాజేందర్ కు మెజారిటీ ఎంత వస్తున్నదని జరుగుతోందన్నారు. 
 

Tagged Telangana, union minister kishan reddy, Kishan reddy, ec, Election commission, Huzurabad, criticisms, bjp campaign, Bypoll Campaign, Hanumakonda district

Latest Videos

Subscribe Now

More News