పోస్టులు త్వరగా భర్తీ చేసేందుకు ప్రణాళికలు

పోస్టులు త్వరగా  భర్తీ చేసేందుకు ప్రణాళికలు

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగాల నియామకాలపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్​ సోమేశ్ కుమార్​ గురువారం బీఆర్కే భవన్​లో రివ్యూ చేశారు. ఆయా శాఖల్లో ఖాళీలు, భర్తీ విధానం, రిక్రూట్​మెంట్​ ఏజెన్సీలు వంటి అంశాలపై చర్చించినట్లు తెలిసింది. సీఎం అసెంబ్లీలో ప్రకటించిన 80 వేల ఖాళీల్లో.. ఏ శాఖకు సంబంధించి నోటిఫికేషన్లు ఇస్తే ఇబ్బందుల్లేకుండా నియామక ప్రక్రియ ముగుస్తుందో చెప్పాలని ఆఫీసర్లను సీఎస్ కోరినట్లు సమాచారం. ముందు ఉన్నతస్థాయి పోస్టులు ఆ తర్వాత కింది స్థాయి పోస్టులు భర్తీ చేసేలా ప్రణాళికలు రెడీ చేయాలని నిర్ణయించారు. రెండుమూడు రోజుల్లో కానిస్టేబుల్, ఎస్ఐతో పాటు టెట్​ నోటిఫికేషన్లు ఇచ్చేలా ప్రపోజల్స్​ రెడీ చేయాలన్నారు.