మంత్రి అడ్లూరిపై దాడి నిందితులను కఠినంగా శిక్షించాలి : ఉప్పు సత్యనారాయణ

మంత్రి అడ్లూరిపై దాడి నిందితులను కఠినంగా శిక్షించాలి : ఉప్పు సత్యనారాయణ
  • ఉప్పు సత్యనారాయణ డిమాండ్ 

హైదరాబాద్, వెలుగు: మేడారం పర్యటనలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై జరిగిన దాడిని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని, సెక్యూరిటీ పెంచాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పు  సత్యనారాయణ డిమాండ్ చేశారు. మంత్రి కాన్వాయ్ పై దాడి జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన శనివారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. 

బడుగు బలహీన వర్గాలకు చెందిన మంత్రిపై దాడి జరిగితే కొన్ని వర్గాలు ఆ దాడిని పక్కదారి పట్టించాలని చూడడం ఎంతవరకు సమంజసమని సత్యనారాయణ ప్రశ్నించారు. మంత్రిపై గతంలో జరిగిన బాడీ షేమింగ్ ఘటనను మరువక ముందే ఈ ఘటన జరిగిందన్నారు.