విద్యాశాఖకు డిజిటల్ వెలుగు ‘పాలపిట్ట’..

విద్యాశాఖకు డిజిటల్ వెలుగు ‘పాలపిట్ట’..

ప్రస్తుతం కాలంలో డిజిటల్ సహాయం (డిజిటల్​ హెల్ప్, డిజిటల్ లిటరీసీ) అనేది ప్రతి ఒక్కరికీ అత్యంత ముఖ్యం. ఇది స్మార్ట్​ఫోన్లు, ఇంటర్‌‌నెట్‌,  కంప్యూటర్‌‌లను సులభంగా ఉపయోగించడం ద్వారా ప్రభుత్వ సేవలు పొందడానికి, విద్య, వ్యాపారం, దైనందిన జీవితంలో పనులను వేగంగా, సులభంగా పూర్తి చేసుకోవడానికి సహాయపడుతుంది. 

మన తెలంగాణ రాష్ట్ర విద్యావిభాగంలోని పాఠశాల విద్య అప్‌డేట్స్‌ కోసం పాలపిట్ట (ఇండియన్‌ రోలర్‌‌) అనే ఒక డిజిటల్‌ మస్కట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవలు మన రాష్ట్ర  మీ సేవ వాట్సాప్‌ గవర్నెన్స్‌ సర్వీస్ నెంబర్‌‌ 80969 58096 ద్వారా విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అధికారిక విద్యా ధ్రువపత్రాలు, హాజరు వివరాలు, పథకాల అప్‌డేట్‌లను అందిస్తుంది. ఈ ప్రత్యేక విద్యాశాఖ డిజిటల్‌ ‘పాలపిట్ట’ ఇది జూన్ 2026 నుంచి సేవలను అందిస్తున్నది.

పాలపిట్టనే మస్కట్‌గా ఎందుకంటే..

పాలపిట్ట మన తెలంగాణ రాష్ట్ర పక్షి అని మన అందరికీ తెలిసిన విషయమే. మన రాష్ట్ర పక్షిని  ప్రజలందరికీ మరింత చేరువ చేయడానికి, ఈ డిజిటల్‌ పాలపిట్ట మస్కట్‌గా రూపొందించారు. ఇది సందేశాలను స్నేహపూర్వకంగా, వేగంగా చేరవేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నది. 

ఎలా పనిచేస్తుంది

మన తెలంగాణ పాఠశాల విద్యావిభాగ అప్‌డేట్‌లను పొందడం కోసం ముందుగా మనం అధికారికి నెంబర్‌‌ 80969 58096ను మన ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. తదుపరి వాట్సాప్‌ నుంచి హాయ్ అని మెసేజ్ పంపిస్తే... మెనూ అప్షన్స్ అందుబాటులోకి వస్తాయి. తద్వారా మనకు కావాల్సిన ఆప్షన్‌ను ఎన్నుకుని సేవల వివరాలను పొందవచ్చు. 

మొత్తంగా ఈ పాలపిట్ట సేవల ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాఠశాలల్లో నేరుగా వేచి ఉండకుండా  ఇంటివద్ద నుంచే వివరాలు పొందవచ్చును. అదేవిధంగా స్పష్టమైన సమాచారం వల్ల ఇంటికి, పాఠశాలలకు మధ్య బలమైన సామాజిక బంధం బలపడుతుంది.

- ఎస్. అనిల్‌
ఉపాధ్యాయుడు, ఐసీటీ విభాగం

  • ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీopenpage@v6velugu.com
  • రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. 
  • స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.