తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ప్రమాణం స్వీకారం

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ప్రమాణం స్వీకారం

హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా చాడ విజయ్ భాస్కర్‌‌‌‌ రెడ్డి గురువారం ఉదయం 9.55 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ఫస్ట్ కోర్టు హాల్లో ఆయనతో చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ భూయాన్‌‌‌‌ ప్రమాణం చేయించారు.  కార్యక్రమానికి హైకోర్టు జడ్జిలు, న్యాయాధికారులు, జస్టిస్ విజయ్ భాస్కర్​ రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్​హాజ రయ్యారు. దుబ్బాకలో 1968 జూన్‌‌‌‌ 28న కేశవరెడ్డి, పుష్పమ్మ దంపతు లకు భాస్కర్​రెడ్డి జన్మించారు.  ఓయూలో బీఎస్సీ, లా చదివారు. 1992 డిసెంబర్‌‌‌‌ 31న లాయర్‌‌‌‌గా ఎన్‌‌‌‌రోల్‌‌‌‌ అయ్యారు. గతంలో 12 మంది పేర్లను సుప్రీంకు సిఫార్సు చేసిన జాబితాలో 2పెండింగ్‌‌‌‌లో ఉండిపోయాయి. అందులో విజయ్ పేరును రాష్ట్రపతి ఆమోదించారు.