సిమ్ బ్లాక్ అయితదంటూ స్కూల్ టీచర్ కు ఫోన్ చేసి..

సిమ్ బ్లాక్ అయితదంటూ స్కూల్ టీచర్ కు ఫోన్ చేసి..

సిమ్ బ్లాక్ అయితదంటూ 2 లక్షలు కొట్టేసిండు

స్కూల్ టీచర్ ను  ట్రాప్ చేసిన సైబర్ క్రిమినల్

రాచకొండ పోలీసులకు కంప్లయింట్​

హైదరాబాద్, వెలుగు: మొబైల్ సిమ్ కార్డు బ్లాక్ అయితదంటూ స్కూల్ టీచర్​ను ట్రాప్ చేసిన సైబర్ క్రిమినల్ రూ.2లక్షలు కొట్టేశాడు. వనస్థలిపురంలో ఉండే ఓ టీచర్(52) చాదర్ ఘాట్ లోని గవర్నమెంట్ స్కూల్ లో పని చేస్తోంది. మంగళవారం మధ్యాహ్నం ఆమెకు ఓ కాల్ వచ్చింది.  హిందీలో మాట్లాడిన అవతలి వ్యక్తి ఎయిర్ టెల్ కస్టమర్ కేర్ మెయిన్ బ్రాంచ్ ఢిల్లీ నుంచి  కాల్ చేస్తున్నట్టు చెప్పాడు.  సిమ్ కార్డ్ బ్లాక్ అవకుండా ఉండాలంటే ..తాను పంపించే అకౌంట్ కి ఒక్క రూపాయి ట్రాన్స్ ఫర్ చేయాలన్నాడు. టీచర్​కు డౌట్ వచ్చి పట్టించుకోలేదు. ఇది ఫేక్ కాల్ కాదని,  కనీసం మీ ఫోన్ కి రూ.10 రీచార్జ్ చేసుకుంటే సిమ్ కార్డ్ బ్లాక్ కాదని సైబర్ క్రిమినల్ ఆమెతో చెప్పాడు. ఈ సారి అతడి మాటలు నమ్మిన ఆమె పేటీఎం నుంచి రీచార్జ్ చేసుకుంది. ఆ తర్వాత ఆమె నంబర్ కు ఓ లింక్ పంపించి అందులో ఉన్న ఫాం ఫిల్ చేస్తే ప్రాసెస్ కంప్లీట్ అవుతుందన్నాడు. టీచర్  ఆ లింక్ ఓపెన్ చేసి ఫామ్​లో మొబైల్ నంబర్ , మెయిల్ ఐడీ, పాస్ వర్డ్  ఎంటర్ చేసింది. ఆమె స్మార్ట్ ఫోన్ ని హ్యాక్ చేసిన సైబర్ క్రిమినల్ పేటీఎంకి అటాచ్ అయి ఉన్న రెండు వేర్వేరు బ్యాంక్ అకౌంట్స్ నుంచి రూ.2లక్షలు కొట్టేశాడు.బాధితురాలు రాచకొండ సైబర్ క్రైమ్  పోలీసులకు కంప్లయింట్ చేసింది.

For More News..

నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

కరోనా కష్టంలో ఉంటే ఫీజు పెంపు ఏంది?