హైదరాబాద్ లో భారీ సైబర్ ఫ్రాడ్.. మీ కొడుకుకు యాక్సిడెంట్ అని చెప్పి.. వృద్ధురాలి నుంచి రూ. 35 లక్షలు కాజేసిన చీటర్స్

 హైదరాబాద్ లో భారీ సైబర్ ఫ్రాడ్..  మీ కొడుకుకు యాక్సిడెంట్ అని చెప్పి.. వృద్ధురాలి నుంచి రూ. 35 లక్షలు కాజేసిన చీటర్స్

హైదరాబాద్ లో  మరో భారీ సైబర్ స్కామ్ బయటపడింది. కొడుకుకు యాక్సిడెంట్ అయిందంటూ నమ్మించి  ఓ వృద్ధురాలి నుంచి  35 లక్షలు కాజేశారు  సైబర్ చీటర్స్.

 సౌత్ మంచెస్టర్ హాస్పిటల్ లో యురాలజిస్ట్   స్టీవ్ రోడ్రిగ్జ్ పేరుతో  61 ఏళ్ల వృద్ధురాలికి కాల్ చేశారు స్కామర్స్. మీ కొడుకుకు లండన్ ఎయిర్పోర్ట్ లో యాక్సిడెంట్ అయిందని వృద్ధురాలికి  చెప్పారు.  ప్రమాదం సమయంలో అతని లగేజ్ కనిపించలేదని , ఐడెంటిటీ లేకపోవడంతో ఏ హాస్పిటల్ లో చేర్చుకోలేదని తాను చట్టవిరుద్దంగా చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు  స్కామర్స్.  చికిత్స కోసం డబ్బులు చెల్లించాలని బాధిత వృద్ధురాలిపై ఒత్తిడి చేశారు స్కామర్స్.  

కన్న కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని ఏ మాత్రం ఆలోచించకుండా పలు దఫాలుగా రూ. 35 లక్షల వరకు డబ్బులను  ట్రాన్స్ ఫర్ చేసింది వృద్ధురాలు.  తన అయితే  తన కొడుకు ఫోటోలు , వీడియోలు పంపించాలని కోరడంతో  సమాధానం దాటేశారు   స్కామర్స్.  అనుమానం వచ్చి తన కొడుకు నెంబర్ కు కాల్ చేయడంతో  స్కామ్ బయటపడింది.  దీంతో  మోసపోయానని గ్రహించిన వృద్ధురాలు  హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.