ఇన్వెస్ట్​మెంట్ పేరుతో రూ.35 లక్షలు కొట్టేసిన్రు

ఇన్వెస్ట్​మెంట్ పేరుతో రూ.35 లక్షలు కొట్టేసిన్రు
  • సైబర్​క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన బాధితులు 

బషీర్ బాగ్, వెలుగు: ఇన్వెస్ట్ మెంట్ పేరుతో సిటీకి చెందిన ముగ్గురి  నుంచి సైబర్ నేరగాళ్లు భారీగా డబ్బు కొట్టేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిటీకి చెందిన ముగ్గురు వేర్వేరు వ్యక్తులు పార్ట్ టైమ్ జాబ్ కోసం ఆన్​లైన్​లో సెర్చ్ చేశారు. కొన్ని నంబర్లకు కాల్ చేశారు. కాల్ రిసీవ్ చేసుకున్న అవతలి వ్యక్తులు..  డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువగా లాభాలు వస్తాయని వీరిని నమ్మించారు.

ఇలా ముగ్గురి నుంచి రూ.35 లక్షలను అకౌంట్​లోకి ట్రాన్స్​ఫర్ చేయించుకున్నారు. ఆ తర్వాత నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన ముగ్గురు బాధితులు శనివారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.