రూ. 50 వేలు నష్టపోయినా.. సైబర్ క్రైమ్​లో ఫిర్యాదు చేయొచ్చు

రూ. 50 వేలు నష్టపోయినా.. సైబర్ క్రైమ్​లో ఫిర్యాదు చేయొచ్చు

కొత్త విధానాన్ని తీసుకొచ్చిన సైబరాబాద్ ​పోలీసులు
గతంలో రూ.1.5 లక్షలు మించిన కేసులే విచారణ
కేసులపై సైబరాబాద్ సీపీ అవినాశ్​ మహంతి స్పెషల్ ఫోకస్
టెక్నికల్ స్కిల్స్‌‌ ఉన్న ఇన్‌‌స్పెక్టర్లు, ఎస్‌‌ఐల నియామకం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో ప్రతి ఏటా సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో సైబర్ నేరాల దర్యాప్తులో సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు స్వల్ప మార్పు చేశారు. రూ.50 వేలు నష్టపోయినా సైబర్ క్రైమ్ పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌లో ఫిర్యాదు చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటి దాకా రూ.1.5 లక్షలకు మించిన కేసులను మాత్రమే సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేశారు.

అంతకంటే తక్కువగా జరిగిన మోసాలను స్థానిక లా అండ్‌‌‌‌ ఆర్డర్ పోలీసులకు అప్పగిస్తు న్నారు. ప్రస్తుతం యాభై వేలు, అంతకంటే ఎక్కువ నష్టపోయిన వారి ఫిర్యాదులను స్వీకరించనున్నారు. యాభై వేల కంటే తక్కువగా జరిగిన మోసాలను స్థానిక లా అండ్‌‌‌‌ ఆర్డర్ పోలీసులు దర్యాప్తు చేసేలా చర్యలు తీసుకున్నారు. లా అండ్‌‌‌‌ ఆర్డర్ పోలీసులకు టెక్నికల్ స్కిల్స్ లేకపోవడం, బందోబస్తులు, ఇతర ప్రాపర్టీ కేసుల దర్యాప్తు కారణంగా సైబర్ నేరాలను నిర్లక్ష్యం చేస్తున్నారు.

కేసులు నమోదు చేసినప్పటికీ నేరగాళ్లను గుర్తించడం, డబ్బులు ట్రాన్స్‌‌‌‌ఫర్ అయిన పేమెంట్‌‌‌‌ గేట్‌‌‌‌ వేస్‌‌‌‌, బ్యాంకు అకౌంట్స్‌‌‌‌ను ఫ్రీజ్ చేయడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఎఫ్‌‌‌‌ఐఆర్ నమోదు చేయడంలో కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు.

 సైబరాబాద్‌‌‌‌లో ఇప్పటికే  967 సైబర్ కేసులు

బాధితులకు సత్వర న్యాయం, నమ్మకం కలిగించే లా సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఈ కొత్త విధానానికి ప్రణాళికను రూపొందించారు. రూ.50 వేలు మోసం జరిగినప్పటికీ ఫిర్యాదులు స్వీకరించేలా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఫిర్యాదుల సంఖ్య పెరిగిపోయింది. గతంలో ప్రతి రోజు 10 నుంచి 15 ఫిర్యాదులు వస్తుండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 20 నుంచి 25కు పెరిగింది.

ఈ ఏడాది జనవరి నుంచి సోమవారం వరకు 967కు పైగా సైబర్ క్రైమ్ ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో జాబ్‌‌‌‌ ఫ్రాడ్స్, ఆన్‌‌‌‌లైన్ ట్రేడింగ్‌‌‌‌, వర్క్‌‌‌‌ ఫ్రమ్ హోం లాంటి సైబర్ నేరాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలోనే సైబర్ నేరాల నియంత్రణ, ఇన్వెస్టిగేషన్ కోసం సీపీ అవినాష్ మహంతి ఈ మార్పులు చేపట్టారు. టెక్నికల్ స్కిల్స్‌‌‌‌ ఉన్న ఇన్‌‌‌‌స్పెక్టర్లు, ఎస్‌‌‌‌ఐలను నియమించారు. సైబర్ నేరాలపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు.