- టెలిగ్రామ్‌లో ఫొటోలు పంపి సెక్స్ సర్వీస్ అందిస్తామని హామీ
- అబిడ్స్‌లో హోటల్ బుకింగ్, డిపాజిట్ అంటూ డబ్బులు కొట్టేసిన కేటుగాళ్లు
బషీర్‌బాగ్, వెలుగు: ఓ యువకుడిని హనీట్రాప్‌లో దించిన సైబర్ స్కామర్స్ అతని వద్ద నుంచి రూ.1.02 లక్షలు కాజేశారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. యాకత్ పురకు చెందిన యువకుడితో స్కామర్స్ మహిళ పేరిట టెలిగ్రామ్ ద్వారా చాటింగ్ చేశారు. నకిలీ ఫొటోస్, పలు ఫీడ్ బ్యాక్ రివ్యూస్ ను పంచుకున్నారు. సెక్సువల్ సర్వీస్ పేరుతో హనీట్రాప్ లో దించారు.
బాధితుడు వారి మాటలు నమ్మి హోటల్ బుకింగ్, సర్వీస్ సెక్యూరిటీ డిపాజిట్ వంటి చార్జెస్, రిఫండబుల్ ప్రాసెస్ కు మొత్తం రూ.1,02,093 యూపీఐ ద్వారా స్కామర్స్ కు బదిలీ చేశాడు. తర్వాత వారు చెప్పినట్లు అబిడ్స్ లోని ఓ హోటల్ వద్దకు వెళ్లగా.. అక్కడ ఎవరూ లేరు.
దీంతో మోసపోయానని గ్రహించాడు. స్కామర్స్ మళ్లీ కాల్చేసి, చాటింగ్ ను ఆన్లైన్ లో పెడతామని బెదిరించి అదనంగా రూ.10 వేలు డిమాండ్ చేశారు. బాధిత యువకుడు సోమవారం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు.
