వాళ్లంతా ఎలక్ట్రీషియన్స్.. రాత్రయితే చాలు ఏం చేస్తున్నారంటే

వాళ్లంతా ఎలక్ట్రీషియన్స్.. రాత్రయితే చాలు ఏం చేస్తున్నారంటే

ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ గ్యాంగ్‌లను పట్టుకున్న పోలీసులు

హైదరాబాద్: వాళ్లంతా సాధారణ ఎలక్ట్రీషియన్స్.. పొట్ట చేత పట్టుకును సుదూర ప్రాంతాల నుండి కష్టపడి బతుకుతున్నట్లు కనిపిస్తారు. అలాంటి వీరు రాత్రయితే చాలు సులభంగా డబ్బు సంపాదించడం కోసం దొంగతనాలకు పాల్పడుతున్నారు. అది కూడా ఎవరూలేని నిర్జన ప్రాంతాల్లో.. భవన నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లోకి వెళ్లి నిర్మాణానికి వాడుతున్న కాపర్ వైర్లను ఎత్తుకెళతారు. వాచ్ మెన్లు, లేదా ఎవరైనా అడ్డుకోబోతే వారిని గన్ చూపించి బెదిరిస్తారు. గత కొన్ని నెలలుగా ఇలా చోరీలకు పాల్పడుతున్న వీరి ఆగడాలకు సైబరాబాద్ పోలీసులు చెక్ పెట్టారు. ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ నుండి వచ్చి పగలంతా ఎలక్ట్రీషియన్ పనులు చేసుకుంటూ రాత్రి పూట దోపిడీకి పాల్పడుతున్న రెండు ముఠాలకు చెందిన మొత్తం 20 మందిని అరెస్టు చేశారు. నిందితులను గచ్చిబౌలి సైబరాబాద్ సీపీ ఆఫీసులో మీడియా ఎదుట ప్రవేశపెట్టిన సందర్భంగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ వీరి ఆగడాలను వెల్లడించారు.  బాలానగర్ ఎస్వోటి ,శంషాబాద్ ఎస్వోటి పోలీసులు అరెస్టు చేసిన 11 మంది నిందితుల నుంచి 55 లక్షల విలువైన  రాగి, కాపర్ వైర్లు, ఒక నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. అలాగే దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గన్స్ తో బెదిరించి చోరీ లకు పాల్పడుతున్న మరో 9మంది ముఠా ను అరెస్ట్ చేశారు. ఈ ముఠా ఉత్తర ప్రదేశ్ ,రాజస్థాన్ ల నుండి వచ్చిన గ్యాంగ్స్ గా గుర్తించారు. వీళ్లు అందరూ పగటిపూట ఎలక్ట్రిషన్స్ పనులు చేసుకుంటారని.. రాత్రయితే చాలు రెక్కీ చేసి దోపిడీలకు పాల్పడుతున్నారని వివరించారు. వీరిపై సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే 7 కేసులు నమోదై ఉన్నాయని.. వీరంతా రాగి వైర్లు దొంగలిస్తున్నట్లు గుర్తించామన్నారు. గత వారం ఈ గ్యాంగ్ కన్స్ట్రక్షన్స్  జరుగుతున్న ఏరియా కు వెళ్లి రెక్కీ చేసి రాత్రి 11 గంటల నుంచి 3 గంటల మధ్య కాపర్ వైర్లు దొంగలించారని, అలా చోరీ చేసిన కాపర్ వైర్లను డీలర్లకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు గుర్తించామన్నారు. కన్స్ట్రక్షన్స్ జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లి  గన్ తో బెదిరించి కాపర్ వైర్లు దొంగలిస్తున్నఈ ముఠా దుండిగల్ ,ఆర్సీ పురం, శంకరపల్లి లో చోరీలకు పాల్పడినట్లు తేలిందన్నారు. నిందితుల నుంచి 55 లక్షల 10వేల విలువ చేసే కాపర్ వైర్లు, 9లక్షల 50వేల నగదు, ఒక పిస్టల్, బొలెరో వెహికల్ స్వాధీనం చేసుకున్నామని సజ్జనార్ వివరించారు.  పెద్ద పెద్ద  కన్స్ట్రక్షన్స్ జరుగుతున్న ఏరియా ల్లో ప్రతి ఒక్కరూ నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని.. ఇలాంటి చోరీలకు ఆస్కారం లేకుండా అలారం సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.

ఇవీ చదవండి

వాట్సప్ కొత్త పాలసీతో ఊపందుకున్నసిగ్నల్, టెలిగ్రామ్

పక్షుల సేఫ్టీ కోసం ఈ కైట్స్ ను వాడండి

బ్రౌన్‌ రైస్‌.. వైట్‌రైస్‌ ఏది మంచిది?