పోలీస్ అధికారిక వెబ్‌సైట్ల పునరుద్ధరణ

పోలీస్ అధికారిక వెబ్‌సైట్ల పునరుద్ధరణ

హైదరాబాద్​ సిటీ, వెలుగు: సైబరాబాద్, రాచకొండ పోలీస్​ కమిషనరేట్ల అధికారిక వెబ్​సైట్లు పూర్తిస్థాయిలో  రీ యాక్టివేట్​అయ్యాయి. వెబ్​సైట్లలో అనుమానాస్పద మాల్​వేర్​డిటెక్ట్​ కావడంతో  నవంబర్15 నుంచి సాంకేతిక నిర్వహణ, సిస్టమ్ అప్‌గ్రేడ్, సెక్యూరిటీ కోసం తాత్కాలికంగా ఆఫ్‌లైన్‌లో ఉంచినట్టు అధికారులు వెల్లడించారు. ఈ పనులు పూర్తయ్యాయని, వెబ్‌సైట్లు ఇప్పుడు పూర్తి స్థాయిలో  పని చేస్తున్నాయని సైబరాబాద్​సైబర్​క్రైం డీసీపీ సధీంద్ర గురువారం తెలిపారు. 

 కొంత కాలంగా ప్రభుత్వ శాఖలకు చెందిన వెబ్‌సైట్ల మీద వరుసగా సైబర్ దాడులు జరుగుతుండటంతో ఆయా విభాగాల్లో సైబర్‌ భద్రతపై కొత్త చర్చ మొదలైంది. అయితే,  వెబ్‌సైట్ల సెక్యూరిటీ ఫీచర్లను మరింత బలోపేతం చేస్తున్నామని,  భవిష్యత్‌లో మరోసారి ఇలాంటి దాడులు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.