సైక్లోన్ బైపార్జోయ్.. దీనికి ఈ పేరు ఎలా వచ్చిందంటే

సైక్లోన్ బైపార్జోయ్.. దీనికి ఈ పేరు ఎలా వచ్చిందంటే

ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం 'బిపార్జోయ్' తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇటీవల తెలిపిన విషయం తెలిసిందే. దీని గురించి పక్కన పెడితే.. అసలు ఈ తుపానుకు బిపార్జోయ్ అనే పేరు ఎందుకు వచ్చింది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

సైక్లోన్ బిపార్జోయ్ అనే పేరు ఎలా వచ్చింది?

'బిపార్జోయ్' అనే పేరు బంగ్లాదేశ్ వారు పెట్టింది. దీని అర్థం 'విపత్తు'. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO)లోని దేశాలు 2020లో ఈ పేరును స్వీకరించాయి. ఇది బంగాళాఖాతం, అరేబియా సముద్రంతో సహా ఉత్తర హిందూ మహాసముద్రంపై ఏర్పడే అన్ని ఉష్ణమండల తుపానులను కూడా కలిగి ఉంటుంది. ప్రాంతీయ నియమాలను బట్టి తుఫానులకు పేర్లు పెడతారు.

ప్రపంచ వాతావరణ సంస్థ/యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ (WMO/ESCAP) ప్యానెల్ ఆన్ ట్రాపికల్ సైక్లోన్స్ (PTC)లకు తుఫానులకు పేరు పెట్టే బాధ్యతను కలిగి ఉంది. హెచ్చరిక సందేశాలను త్వరితగతిన గుర్తించడం కోసం ఈ పద్దతిని తీసుకువచ్చారు. ఎందుకంటే సంఖ్యలు లేదా ఇతర సాంకేతిక పదాల కంటే పేర్లు చాలా సులభంగా గుర్తుంచుకోవచ్చు.