రికార్డు బ్రేక్ : ఆర్టీసీలో 20 లక్షలకు చేరిన రోజువారీ ప్రయాణికులు.. మహిళలు ఎంత మందో తెలుసా..?

రికార్డు బ్రేక్ : ఆర్టీసీలో 20 లక్షలకు చేరిన రోజువారీ ప్రయాణికులు.. మహిళలు ఎంత మందో తెలుసా..?

తెలంగాణ ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య రికార్డు బ్రేక్ చేసింది. రోజువారీ ప్రయాణికుల సంఖ్య 20 లక్షలకు చేరింది. విశేషం ఏంటంటే.. ఇందులో 70 శాతం మంది మహిళలు.. అంటే రోజుకు 20 లక్షల మంది ఆర్టీసీ బస్సులు ఎక్కుతుంటే.. 14 లక్షల మంది మహిళలే కావటం విశేషం. ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణం పథకం  కారణంగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది అని చెప్పొచ్చు. డిసెంబర్ 9న ప్రారంభమైన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పథకం కారణంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

అసలే పొదుపు చేయటంలో దిట్ట అయిన మహిళామణులు ఉచిత బస్సు ప్రయాణం లాంటి పథకానికి పూర్తీ న్యాయం చేస్తున్నారు.ఈ పథకం ప్రారంభించిన కొత్తలో రోజువారీ ప్రయాణికుల సంఖ్య 16లక్షలు ఉండగా, క్రమక్రమంగా పెరిగి 20లక్షలకు చేరింది.ఈ పథకం ప్రారంభించిన  నాటి నుండి రాష్ట్రవ్యాప్తంగా మహిళా ప్రయాణికులకు సుమారు 54కోట్ల జీరో టికెట్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.ఈ పథకం ద్వారా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యొక్క వినియోగం పెరగటమే కాకుండా ప్రజలకు ఆర్థికంగా వెసలుబాటు కూడా లభించినట్లు అవుతుందని ఆర్టీసీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.