
దళపతి విజయ్(Dalapti Vijay) నటిస్తున్న లియో(Leo) మూవీ నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. దళపతి పుట్టిన రోజు సందర్భంగా జూన్ 22 న సాయంత్రం 6:30 కు ఫస్ట్ సింగల్ ‘నా రెడీ’ని విడుదల చేయనున్నట్టు టీమ్ ప్రకటించిన విషయం తెలిసేందే.ఇప్పుడు తాజాగా రిలీజ్ అయినా సాంగ్ తో విజయ్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.ముఖ్యంగా ఈ సాంగ్ లో విజయ్ వేసిన మాస్ స్టెప్పులు అభిమానులను ఆకట్టుకుంటుంది.ఈ సాంగ్ తో అంచనాలన్నీ అమాంతం పెరిగిపోయాయి. ఇప్పటికే రిలీజ్ అయినా పోస్టర్, ఫస్ట్ గ్లిమ్ప్స్ తో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) ఈ మూవీ కి ఆదిరిపోయే ట్యూన్స్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.వీరి కాంబోలో వచ్చిన మాస్టర్ మూవీ సాంగ్స్ చార్ట్ బ్లాస్టర్ అయినా విషయం తెలిసేందే. లోకేష్ కనగ రాజ్(Lokesh Kanagaraj) డైరెక్షన్ లో రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.విజయ్ కి జోడీగా త్రిష(Trisha) నటిస్తున్న ఈ మూవీ లో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్(Sanjay datt),అర్జున్(Arjun),ప్రియా ఆనంద్(Priya Anand) ముఖ్య పాత్రల్లో నటిసున్నారు.ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ని అక్టోబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.