నా మంత్రి పదవి హైకమాండ్ నిర్ణయిస్తది : ఎమ్మెల్యే దానం నాగేందర్

నా మంత్రి పదవి హైకమాండ్ నిర్ణయిస్తది : ఎమ్మెల్యే దానం నాగేందర్
  • ఎమ్మెల్యే దానం నాగేందర్ కామెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: మంత్రి పదవి తనకు ఇవ్వాలా వద్దా అనేది కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైకమాండ్ నిర్ణయిస్తదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. సోమవారం గాంధీ భవన్ లో జరిగిన ‘అందుబాటులో ప్రజాప్రతినిధులు’ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆయన హాజరయ్యారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని అన్నారు. ఇక్కడ కాంగ్రెస్ గెలవాలంటే తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు.

 సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఛాలెంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కేటీఆర్ స్వాగతించాలిగానీ, వక్రీకరించడం సరికాదని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం చాలా మంది బీసీ నేతలు ప్రయత్నించినా.. ఓసీకి ఇవ్వడం ఆ పార్టీ సిద్ధాంతాలను స్పష్టం చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామనే ఊహల్లో ఆ పార్టీ నేతలు ఉన్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేరుకే పసుపు బోర్డు అని, దానికి చైర్మన్ ఉన్నా, అక్కడ కనీసం ఆఫీసు కూడా లేదని విమర్శించారు.