శంకరపట్నం, వెలుగు: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని ఫర్టిలైజర్ షాపులను జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి బుధవారం తనిఖీ చేశారు. సోమేశ్వర ఫర్టిలైజర్స్, మెట్‌పల్లి సహకార సంఘం పరిధిలోని కన్నాపుర్ గ్రామంలోని సొసైటీ గోదాంను సందర్శించి, రూల్స్ మేరకు అమ్మకాలు చేపట్టాలని సూచించారు. మండలంలో జనవరి 31 నుంచి 7,439 యూరియా బస్తాలను బుక్ చేసుకొని ,6703 బస్తాలు కొనుగోలు చేసినట్లు చెప్పారు.
తాడికల్, కన్నాపూర్, గద్దపాక, మొలంగూర్ సొసైటీలకు బుధవారం మరో 60 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందన్నారు. అవసరానికి తగ్గట్టుగా యూరియా సప్లై చేస్తామని, రైతులు ఆందోళన చెందొద్దని సూచించారు. కార్యక్రమంలో మానకొండూరు ఏడీఏ శ్రీధర్, రైతులు పాల్గొన్నారు
