భక్తజన సంద్రంగా ఐనవోలు

భక్తజన సంద్రంగా  ఐనవోలు

ఐనవోలు  భక్తజన సంద్రంగా  మారింది. జాతరకు  వేల సంఖ్యలో  తరలివచ్చారు భక్తులు.   స్వామివారి దర్శనం కోసం  వీఐపీలు  ,ప్రజాప్రతినిధులు  క్యూకట్టారు.  కరోనా నిబంధనల   ప్రకారం  మాస్క్ లు  ఉన్న భక్తులనే దర్శనానికి  అనుమతిస్తున్నారు  అధికారులు. 

హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లన్న జాతర ఘనంగా జరుగుతోంది. స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఐనవోలు జనసంద్రంగా మారింది. గజ్జెల లాగులు,డప్పుల చప్పుళ్లు, ఢమరుకం మోతలతో జారత ప్రాంతం సందడిగా మారింది. కోరికెలు తీరితే కోడెలను కడతాం,పంటలు భాగా పండితే పట్నాలు వేస్తాం, పిల్లాజెల్లాను సల్లగంగా చూడు స్వామి అంటూ భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతరకు హైదారాబాద్, ఖమ్మం,కరీంగనర్, వరంగల్,రంగారెడ్డి,నల్గొండ జిల్లాల నుంచి వేల సంఖ్యలో తరలివచ్చారు భక్తులు. ఢమరుకం  మోగిస్తూ, స్వామి వారికి  పట్నం వేస్తూ సందడి చేశారు ఒగ్గు పూజారులు. భోనాలు ఎత్తుకొని ఆయలం చుట్టూ ప్రదక్షిణలు చేశారు భక్తులు.  

ఐనవోలు మల్లన్న దర్శనానికి ప్రజాప్రతినిధులు, నేతలు క్యూకట్టారు. మంత్రి సత్యవతిరాథోడ్,ఎమ్మెల్సీ బస్వ రాజు సారయ్య, ఎమ్మెల్యే ఆరూరి రమేష్,మేయర్ గుండు సుధారాణి లతో పాటుగా స్థానిక ప్రజా ప్రతినిదులు, అదికారులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. జాతర కొచ్చే భక్తులంతా కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. విపక్షాల నేతలు  కొందరు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ బురద జల్లె ప్రయత్నం చేస్తున్నారని మంత్రి విమర్శించారు. 

గజ్జెల లాగులు,చేతిలో చర్నా కోల పట్టుకొని పూనకాలతో ఊగి పోయారు భక్తులు. కొందరు పురుషులు మహిళల వేషంతో స్వామి, అమ్మవార్లకు నైవేద్యం సమర్పించారు.  మరికొందరు భక్తులు వరాలు పట్టారు.తమకు సంతానం కలిగేలా చూడాలని స్వామి వారిని కోరుకున్నారు. వీఐపీలు,ప్రజా ప్రతినిదులు రావడం వల్ల తాము ఇబ్బందులు పడాల్సి వచ్చిందన్నారు భక్తులు. ప్రముఖ క్షైవ క్షేత్రమైన ఐనవోలు జాతరలో శివసత్తుల పూనకాలు, ఓగ్గు పుజారుల నృత్యాలు  ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతి సంక్రాంతి కి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటామన్నారు భక్తులు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో మాస్క్ లు పెట్టుకున్నవారినే దర్శనానికి అనుమతించారు అధికారులు.