సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న దసరా దర్శకుడు

సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న దసరా దర్శకుడు

దసరా సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ ఓదెల సైలెంట్ గా పెళ్లి చేసేసుకున్నాడు. మే 31న కరీంనగర్‌ జిల్లాలోని గోదావరిఖనిలో అతని పెళ్లి ఘనంగా జరిగింది. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినప్పటికీ అమ్మాయి మాత్రం తన ప్రాణ స్నేహితుడి సోదరి కావడం విశేషం. ఈ వివాహనికి ఇరుకుటుంబాల సభ్యులు, స్నేహితుల హాజరయ్యారు. నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ ఈ పెళ్లికి హాజరు అవ్వాల్సి ఉంది కానీ.. ఈ ఇద్దరూ తమ తమ ప్రాజెక్టుల్లో బిజీగా ఉండటంతో హాజరు కాలేకపోయారు. 

ట్విటర్ వేధికగా   శ్రీకాంత్‌కు శుభాకాంక్షలు తెలియజేశాడు నాని. మన శ్రీకాంత్ పెళ్లి చేసుకున్నాడు. ఈ కొత్త జంటను అందరూ దీవించండి అంటూ ట్వీట్ చేస్తూ.. శ్రీకాంత్ పెళ్లి ఫోటోను షేర్ చేశాడు. ఇక శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ‘దసరా’ సినిమా ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ జంటగా నటించిన ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూళ్ళని రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక శ్రీకాంత్ ఓదెల తరువాతి సినిమా ఏంటి? ఎవరితో చేయబోతున్నాడు? అనే ఇంకా తెలియాల్సి ఉంది.