- స్కూళ్లకు 22 వరకు, ఇంటర్ కాలేజీలకు 21 వరకు హాలిడేస్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు ఈ నెల 10వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. స్కూళ్లకు 13 రోజులు, ఇంటర్ కాలేజీలకు 12 రోజుల పాటు దసరా హాలిడేస్ ఉండనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్కారు, ప్రైవేటు, ఎయిడెడ్ తో పాటు అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయి. తిరిగి అక్టోబర్ 23న స్కూళ్లు రీఓపెన్ కానున్నాయి.
కాలేజీలకు 21 వరకు సెలవులు..
ఇంటర్మీడియట్ బోర్డు క్యాలెండర్ ప్రకారం.. అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని జూనియర్ కాలేజీలకు ఈ నెల10 నుంచి 21 వరకు దసరా సెలవులు ఉంటాయి. అక్టోబర్ 22న కాలేజీలు తెరుచుకోనున్నాయి. హాలిడేస్ షెడ్యూల్‌ను విద్యాసంస్థలన్నీ కచ్చితంగా పాటించాలని, దసరా సెలవుల్లో ఎలాంటి ప్రత్యేక తరగతులు నిర్వహించొద్దని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.
