అంతా అయిపోయాక కేటీఆర్ లేఖలు రాస్తే ఏం లాభం

అంతా అయిపోయాక కేటీఆర్ లేఖలు రాస్తే ఏం లాభం

ఐటీఐఆర్ ను  రద్దు చేస్తున్నట్లు 2018 లో కేంద్రం లేఖ రాస్తే… కేటీఆర్ 2021లో ప్రాజెక్టుపై లేఖ రాయడం సిగ్గుచేటన్నారు కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్. బీజేపీ, టీఆర్ఎస్  మధ్య ఐటీఐఆర్ నగిలిపోయిందన్నారు. ఐటీఐఆర్ డిపిఆర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే వచ్చిందన్నారు. కానీ కేటీఆర్ అంతా అయిపోయాక.. లేఖలు రాస్తే ఏం లాభమన్నారు. తెలంగాణ ఆర్ధికంగా బలపర్చే ప్రాజెక్టు ఫై పార్లమెంట్ లో చర్చించలేదన్నారు. ఐటీఐఆర్ వస్తే లక్షలాది మంది తెలంగాణ యువతకు ఐటీ ఉపాధి అవకాశాలు దొరికేవన్నారు. ఇప్పుడు కేటీఆర్ ఐటీఐఆర్ వద్దని దాని ప్లేస్ లో మరో ప్రాజెక్టు ఇవ్వమని లేఖ రాశారన్నారు. ఐటీఐఆర్ పై కేంద్రంతో ఫైట్ చేయడానికి కాంగ్రెస్ సిద్ధమన్నారు. కాంగ్రెస్ ఎంపీలు ఎక్కడికి రమంటే అక్కడికి వస్తారన్నారు. ఢిల్లీకి  వెళ్లి.. మోడీ ఇంటి వద్ద కూర్చుందామన్నారు.