టీఆర్ఎస్ బెల్లం లేని బూరెలు చేస్తుంది

టీఆర్ఎస్ బెల్లం లేని బూరెలు చేస్తుంది

టీఆర్ఎస్ కు  మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కులేదన్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. మున్సిపల్ శాఖకు కేటాయింపులు వేల కోట్లు దాటాయి  కానీ మంజూరు మాత్రం వందల కోట్లు లేవన్నారు. టీఆర్ఎస్ బెల్లం లేని బూరెలు చేస్తుందని ఎద్దేవా చేశారు.  నిధులు ఇవ్వరు కానీ.. మాటల గారడీ చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ – బీజేపీ  ప్రభుత్వాలు కూడా నిధులు ఇవ్వడం లేదన్నారు. స్మార్ట్ సిటీలు అని చెప్పిన  కేంద్ర ప్రభుత్వం వరంగల్ కు మాత్రం నిధులివ్వలేదన్నారు. ఓటు వేసే ముందు ప్రజలు ఒక్కసారి ఆలోచించి వేయాలన్నారు.