
నయీం ఎన్ కౌంటర్ జరిగి మూడేళ్లు అయినా… ఇప్పటి వరకు కేసు తేల్చలేకపోయారని అన్నారు కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ. నయీం బాధితులకు ఇప్పటివరకు న్యాయం జరగలేదన్నారు. భువనగిరికి వెళ్లిన దత్తాత్రేయ అక్కడ బీజేపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. మూసీ పరివాహక ప్రాంతం అంతా కలుషితమై రైతులకు తీవ్ర నష్టం కలుగుతోందని అన్నారు. మూసీ ప్రక్షాళన పక్కన పెట్టి సుందరీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ చేస్తోందని ఆరోపించారు.