- కోర్టు ఆర్డర్ ఉన్నా పట్టించుకోవట్లేదని నిరసన
సత్తుపల్లి, వెలుగు : తనకు న్యాయం చేయాలంటూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఆదివారం అత్త ఇంటి ఎదుట ఓ కోడలు పెట్రోల్ బాటిల్తో నిరసనకు దిగింది. హనుమాన్ నగర్ కు చెందిన కోనేటి హరికృష్ణకు పట్టణానికి చెందిన నిహారికతో 2018లో పెండ్లయ్యింది. వీరికి నాలుగేండ్ల కొడుకు ఉన్నాడు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 3 నెలలుగా దూరంగా ఉంటూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.
అయితే, వారంలో రెండుసార్లు తల్లికి కొడుకుని చూపించాలని కోర్టు ఆర్డర్ఉన్నా నెల రోజుల నుంచి చూపించడం లేదని నిహారిక ఆదివారం పెట్రోల్బాటిల్తో నిరసనకు దిగింది. న్యాయం జరిగేంతవరకు ఆందోళన విరమించేదిలేదని పట్టుబట్టడంతో నిహారిక కుటుంబసభ్యులు, పెద్దలు సర్ధి చెప్పడంతో విరమించింది.
