తల్లి కోసం కూతురు దీక్ష

తల్లి కోసం కూతురు దీక్ష

తన కన్నతల్లిని తెచ్చివ్వాలంటూ…సిద్దిపేట జిల్లా చేర్యాలలో ధర్నాకు దిగిందో అమ్మాయి. పుట్టగానే తండ్రి చనిపోవడం, తల్లికి టీచర్ గా ఉద్యోగం రావడంతో పెద్దనాన్న దగ్గర పెరిగింది. అయితే ఇటీవల తన తల్లిజాడ తెలుసుకుని పెద్దనాన్నతో కలిసి వెళితే…తనను రానివ్వలేదని వాపోయింది బాధితురాలు. తన కూతురు కాదని…ఇంటి నుంచి వెళ్లిపోవాలని చెప్పిందని కన్నీళ్లు పెట్టుకుంది. దీనిపై పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని…దీంతో చేసేది లేక ధర్నాకు దిగానని చెబుతోంది.