బైక్పై వెళ్తుండగా లవర్స్ మధ్య లొల్లి.. నీ చావు ఇలా రాసి పెట్టి ఉండటమేంటి తల్లీ !

బైక్పై వెళ్తుండగా లవర్స్ మధ్య లొల్లి.. నీ చావు ఇలా రాసి పెట్టి ఉండటమేంటి తల్లీ !

బెంగళూరు: కర్ణాటకలోని దావణగెరెలో షాకింగ్ ఘటన జరిగింది. బైక్పై వెళ్తూ లవర్స్ గొడవ పడ్డారు. బైక్ రన్నింగ్లో ఉండగా గొడవ పడటంతో.. ఈ పెనుగులాటలో కరెంట్ స్తంభాన్ని బైక్ ఢీ కొట్టింది. యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన దావణగెరె శివార్లలోని మిట్లకట్టె గ్రామ సమీపంలో జరిగింది. చనిపోయిన యువతిని 21 ఏళ్ల ప్రియగా గుర్తించారు. గాయపడిన యువకుడిని యోగేష్గా గుర్తించారు. ఇద్దరూ కాలేజ్కు వెళ్లి భోజనం కోసం ఒక దాబాకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన సమాచారం ప్రకారం.. దాబాలో ప్రియా, గాయపడిన యోగేష్ మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ గొడవ అక్కడి సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డైంది. ఈ గొడవ తర్వాత, ప్రియ తన స్నేహితురాలితో కలిసి స్కూటీపై వెళుతోంది. ఈ సమయంలో.. బుల్లెట్ బైక్పై ప్రియను, ఆమె స్నేహితురాలిని యోగేష్ వెంబడించాడు. రోడ్డు మధ్యలో వాళ్లను అడ్డగించి ప్రియాను తన బైక్పై ఎక్కించుకుని తీసుకెళ్లాడు. ఈ సమయంలో కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగి బైక్ అదుపు తప్పడంతో ప్రియా స్పాట్లోనే చనిపోయింది. యోగేష్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.